Friday, February 7, 2025

Mahakumbh Sharing experiences

 







శ్రీ కేశిరాజు 9573891255

144 సంవత్సరాలకి ఒకసారి గురువు కుంభరాశి సూర్య చంద్రులు మేష రాసి ప్రవేశం సందర్భం గా వచ్చే ఒక అద్భుత అవకాశం మహా కుమ్భ మేళ .

 మహాకుంభ మేళ కి వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు ..నేను చాలా ప్రశాంతం గా వెళ్లి వచ్చాను .. అనుభవం తో కొన్నివిషయాలు షేర్ చేసుకుందామని తాపత్రయం ..

1 కోటి మంది వచ్చే మాట నిజమే గాని చాలా మంది స్నానం చేస్కొని తిరుగు ప్రయాణం అయ్యేవాళ్లే.మీరు అనుకున్నంత , TV లో చూసినంత తొక్కిడి చాలా తక్కువ ఘాట్స్ లోనే ఉంటుంది . ఇంకా మాట్లాడితే ఒక్క సంగం ఘాట్ దగ్గరే ఎక్కువ రష్ ఉంది .

 2 .41 ఘాట్స్ ఉన్నాయి ..ఎక్కడినుంచైనా బోట్ లో త్రివేణి సంగమం దగ్గరకి వచ్చేయచ్చు ..మాక్సిమం అరగంట ప్రయాణం పడవ లొ..రాను పోను గంట స్నానానికి పూజలకు ఒక అరగంట సుమారు టైం పడుతుంది

3_ బోట్ కి  మనిషి కి 400 దాకా ఛార్జ్ చేస్తారు .ఇది  రష్ ని బట్టి మారుతుంది . అరైల్ ఘాట్ కానీ బోట్ క్లబ్ కానీ కొంచం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు . కానీ టికెట్స్ ఫ్రీ గా దొరుకుతాయి .ఏమి కంగారు పడక్కరలేదు .వందలాది పడవలు ఉన్నాయి .అరైల్ లొ 800  ఛార్జ్ చేసారు మాకు. చాల బాగా సంగమం దగ్గర కి తీసుకెళ్లి తీసుకుని వచ్చాడు . ఎవరిని తొందర పెట్టలేదు .Leisure  గా స్నానం గంగ పూజ చేసుకు  వచ్చాము

.4. ఊర్లో చాల దూరం నుంచి కార్స్ మోటార్ సైకిల్స్ allow చేయడం లేదు .కాబట్టి 5 నుంచి 15  Kilometre నడవడం ప్రిపేర్ అవండి .కానీ అసలు అలసట తెలియదు .తీర్థాలలో నడచినట్లే .

5.చాల చోట్ల ఉచిత టీ , టిఫిన్స్ ఇస్తున్నారు వివిధ కంపెనీ వాళ్ళు . చాల కంపెనీస్ స్టాల్ల్స్ పెట్టి ప్రొడక్ట్స్ అమ్ముతుంటాయి కాబట్టి తిండి గురించి వర్రీ అవక్కరలేదు

.6.స్నానానంతరం అలాహాబాద్ ఊరిలోకి రావాలంటే మెయిన్ రోడ్ దాకా నడచి OLA  కానీ Rapido  కానీ two  wheelers దొరుకుతాయి . రెంటల్స్ నార్మల్ గానే ఉన్నాయి . కొంచం ట్రాఫిక్ ఎక్కువ  కాబట్టి  two  wheelers ప్రిఫర్ చేయండి .

7  చలి కొంచం ఉంది ..అంత భయంకరం గా ఏమి లేదు .స్వేట్టెర్ వేసుకుంటే చాలు ..రాను రాను తగ్గే చలి . ఈపాటికి ఇంకా తగ్గి పోయి ఉంటుంది . Jerkin  గాని sweater  గాని వేసుకోండి  చాలు .

8 .Accommodation ముందరే ఆరెంజ్ చేసుకోండి . డార్మిటరీ బెడ్స్ అయితే కొంచం ఎక్కువ కాస్ట్ అయినా చాలా దొరుకుతున్నాయి . సివిల్ లైన్స్ ఏరియా లొ చాల ఉన్నాయి . లేదా Adventure  piligrimage  అనుకుంటే మీ ఇష్టం . పెద్ద వాళ్ళు చిన్న పిల్లలు ఉంటె రిస్క్ తీసుకోకండి .

9 .ముఖ్యం గా డేరింగ్ గా వెళ్లిపోయే వాళ్ళు రిటర్న్ జర్నీ కి కంగారుపడకండి . నాగపూర్ దాకా VOLVO అండ్ BENZ స్లీపర్స్ ఉన్నాయి . వీలయితే సికింద్రాబాద్ కి వన్డేభారత్  లేదా  తెలంగాణ ఎక్ష్ప్రెస్స్ కి తత్కాల్ చేసుకని ఎక్కేయండి .

10 కొంచం ప్లానింగ్ తో మీ ట్రిప్ సుఖమయం చేసుకొనండి  . ముఖ్యం గా సెక్టార్ త్రీ లొ మహాకుంభ డిజిటల్ ఎక్ప్పెరియన్సు సెంటర్ ని వీలయితే చూడండి .

11 .కొంచం టైం ఓపిక ఉంటె నాగసాధు ఉండే సెక్టార్ దాకా ,టెంట్ సిటీ చూసి రండి .మంచి experiene  .

12. మరీ ముఖ్యం గా టీవీ చానెల్స్ లు అన్ని సంగం ఘాట్ లొ నే మీడియా పాయింట్ దగ్గరే కెమెరాలు పెట్టుకుని ఉన్నారు .వాళ్ళకి అక్కడ accommodation ఇచ్చారు కాబట్టి అక్కడే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు .మిగతా ఘాట్స్ లొ అంత రష్ లేదు .

చివరగా ముఖ్యమైన విషయం - ఒక వేళ మీరు ట్రైన్ లో వెళుతున్నట్లైతే ఫుల్ రష్ గా ఉంటాయని ప్రిపేర్ అయి వెళ్ళండి .UP BIHAR వెళ్లే ట్రైన్స్ అన్ని అలాగే ఉంటాయి . TC లు ఏమి హెల్ప్ చేయరు .

No comments: